ఈ కుర్రాడి స్పీడు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ కుర్రాడి స్పీడు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు!

Biker at high speeds recorded his ride
  • బెంగళూరు రోడ్లపై సూపర్ బైకర్
  • గంటకు 299 కిమీ వేగంతో రైడింగ్
  • 10 కిలోమీటర్ల పాటు 200 కిమీ స్పీడు తగ్గకుండా ప్రయాణం
కుర్రకారు చేతిలో స్పోర్ట్ బైక్ పడితే ఇక చెప్పేదేముంది! రయ్ మంటూ దూసుకెళుతూ తమ వయసు జోరును బండి చక్రాల వేగంలో ప్రదర్శిస్తారు. గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరులోనూ ఓ కుర్రాడు ఇలాంటి ప్రదర్శన చేశాడు. ఆ కుర్రాడు బండి నడిపిన తీరుకు పోలీసులే ఆశ్చర్యపోయారు. అయితే ఓవర్ స్పీడ్ తో వెళ్లడం నిబంధనలకు వ్యతిరేకం కావడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బెంగళూరు క్రైమ్ విభాగంలో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న సందీప్ పాటిల్ ట్విట్టర్ లో పంచుకున్నారు.

ఆ బైకర్ తన హెల్మెట్ కు కెమెరా అమర్చుకుని తన సూపర్ రైడ్ ను రికార్డు చేశాడు. యమహా 1000 సీసీ బైక్ రోడ్డుపై రివ్వున సాగిపోతుంటే స్పీడోమీటర్ లో అత్యధికంగా 299 కిలోమీటర్ల వేగం నమోదైంది. దాదాపు 10 కిలోమీటర్ల పాటు నిలకడగా 200 కిమీ వేగంతో వెళ్లాడు. అయితే అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.

Biker
Speed
Yamaha 1000cc
Bengaluru
Police

More Telugu News