త్వరలో బిగ్ బాస్-4... అధికారికంగా ప్రకటించిన స్టార్ మా
- ప్రోమో రిలీజ్ చేసిన స్టార్ మా
- సందడి వచ్చేస్తోందంటూ ట్వీట్
- అనుమానాలకు తెరదించిన స్టార్ మా
కాగా, కరోనా రక్కసి విజృంభిస్తుండడంతో వినోద రంగ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఏవో కొన్ని సినిమాల షూటింగ్ లు మళ్లీ మొదలైనా, మునుపటి కళ ఇంకా కనిపించడంలేదు. టీవీ సీరియళ్ల చిత్రీకరణ మొదలైనా పలువురు నటులు కరోనా బారినపడడంతో అక్కడ కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నాలుగో సీజన్ షురూ చేసేందుకు స్టార్ మా సిద్ధపడడం విశేషం అని చెప్పాలి.