లాక్ డౌన్ లో కాజల్ భక్తి మార్గం!

Kajal Agarwal listening to Bhagvadgeetha
  • కొన్నాళ్లుగా ఖాళీగా ఉంటున్న సినిమా తారలు
  • కుటుంబ సభ్యుల మధ్య గడుపుతున్న కాజల్
  • భగవద్గీత, భాగవతం కథలు వింటున్న ముద్దుగుమ్మ  
ఎప్పుడూ షూటింగులతో బిజీబిజీగా గడిపే  సినిమా తారలు గత కొన్నాళ్లుగా ఖాళీ అయిపోయారు. చేతిలో సినిమాలు వున్నా చేయడానికి లాక్ డౌన్ అడ్డొచ్చింది. మరోపక్క, కరోనా కూడా భయపెడుతోంది. దాంతో గత కొన్ని నెలలుగా ఇళ్లకే అతుక్కుపోయారు. ఈ సమయంలో పనిలేక తమకి బోర్ కొట్టేస్తోందని కొంతమంది అసహనం వ్యక్తం చేస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఏవో ఒకటి నేర్చుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అందాలతార కాజల్ కూడా ముంబైలో ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య హ్యాపీగా గడుపుతోందట. పైపెచ్చు, ఈ ఖాళీ సమయాన్ని ఆధ్యాత్మికంగా సద్వినియోగం చేసుకున్నానని చెబుతోంది. ముఖ్యంగా భగవద్గీత, భాగవతం కథలు శ్రద్ధగా విందట. దీని గురించి ఈ ముద్దుగుమ్మ చెబుతూ, "అవును, లాక్ డౌన్ సమయంలో భగవద్గీత, శ్రీమద్ భాగవతం విన్నాను. ఈ పురాణ కథలు నన్నెప్పుడూ ఎంతగానో ఆకర్షిస్తాయి. నన్నలా కట్టిపారేస్తాయి. విలువైన పాఠాలను అర్థం చేసుకునే సమయాన్ని దక్కించుకున్నాను' అని చెప్పింది కాజల్.  
Go Back to Shorts
Kajal Agarwal
Lockdown
Bhagavadgeetha
Bhagavatham

More Telugu News