తెలంగాణ వాసి కరోనా చికిత్సకు రూ.1.50 కోట్ల బిల్లు... పెద్దమనసుతో మాఫీ చేసిన దుబాయ్ ప్రభుత్వం!
- ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వడ్నాల రాజేశ్
- ఏప్రిల్ లో కరోనా సోకడంతో ఆసుపత్రిపాలు
- 80 రోజుల పాటు చికిత్స
బిల్లు వ్యవహారాన్ని దుబాయ్ లో భారత కాన్సులేట్ కు నివేదించాయి. కాన్సులేట్ వర్గాలు రాజేశ్ కరోనా చికిత్స బిల్లు వ్యవహారాన్ని దుబాయ్ ప్రభుత్వానికి వివరించాయి. దీనిపై పెద్దమనసుతో స్పందించిన దుబాయ్ ప్రభుత్వం రూ.1.50 కోట్ల బిల్లును మాఫీ చేసింది. అంతేకాదు, భారత్ వచ్చేందుకు విమాన ఖర్చులు భరించడంతో పాటు, అదనంగా మరో రూ.10 వేలు ఇచ్చి సహృదయత చాటుకుంది. ఇటీవలే భారత్ చేరుకున్న రాజేశ్ ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నాడు.