ఈ 11 యాప్ లు మీ స్మార్ట్ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి: గూగుల్ ప్లే స్టోర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ 11 యాప్ లు మీ స్మార్ట్ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి: గూగుల్ ప్లే స్టోర్

Google Playstore Warns About 11 Apps
  • ప్లే స్టోర్ నుంచి యాప్స్ తొలగింపు
  • జోకర్ పేరిట మాల్ వేర్ ఉన్నందునే
  • ప్రీమియం యాప్స్ ప్రమాదంలో పడతాయని హెచ్చరిక
అత్యంత ప్రమాదకరమైన జోకర్ మాల్ వేర్ పట్టుకున్న 11 యాప్స్ ను తాము ప్లే స్టోర్ నుంచి తొలగించామని, ఎవరి స్మార్ట్ ఫోన్లలో అయినా ఈ యాప్స్ ఉంటే, వాటిని వెంటనే డిలీట్ చేయాలని గూగుల్ కోరింది. గత సంవత్సరం చివర్లో జోకర్ వైరస్ ను గుర్తించామని, ఇది ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తోందని పేర్కొంది. ఇది యాప్స్ లో దాగుండి, స్మార్ట్ ఫోన్లలోకి ఇతర వైరస్ లను ఎవరి ప్రమేయం లేకుండానే డౌన్ లోడ్ చేస్తోందని, దీని కారణంగా ఎన్నో ప్రీమియం యాప్స్ ప్రమాదంలో పడ్డాయని గూగుల్ తెలిపింది.

మొత్తం 11 యాప్ లను తాము డిలీట్ చేశామని చెబుతూ, వాటిల్లో ఇమేజ్ కంప్రెస్, రిలాక్సేషన్, యాండ్రాయిడ్ ఎస్ఎంఎస్, చెర్రీ, సెండ్ ఎస్ఎంఎస్, లవింగ్ లవ్ మెసేజ్, విత్ మీ, హెచ్ఎం వాయిస్, ఫ్రెండ్స్ ఎస్ఎంఎస్, రికవరీ ఫైల్స్, ఎల్ ప్లాకర్, రిమైండ్ మీ, మెమొరీ గేమ్ ట్రయినింగ్ తదితరాలు ఉన్నాయని వెల్లడించింది.

కాగా, తనను గుర్తించకుండా ఉండేందుకు ఈ వైరస్ పాత టెక్నిక్ లను వినియోగిస్తోందని, రెండు మార్గాల ద్వారా స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశిస్తోందని రీసెర్చర్లు వెల్లడించారు. ప్లే స్టోర్ సెక్యూరిటీని దాటి మరీ ఇది యాప్స్ కు పట్టుకుందన్నారు. ఈ వైరస్ ను తయారు చేసిన వారు దాని కోడ్ ను తగ్గించారని, అది కూడా 'డెక్స్' ఫైల్ రూపంలో ఉండి, గుర్తించేందుకు క్లిష్టతరంగా మారిందని తెలిపారు.
Google
Playstore
Malware
Joker
Apps

More Telugu News