పవన్ కల్యాణ్ ట్విట్టర్ అకౌంట్ కు 4 మిలియన్ల ఫాలోవర్లు... కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని
- ప్రత్యేకంగా పోస్టు చేసిన పవన్
- ఇతరులకు భిన్నంగా కఠిన మార్గాన్ని ఎంచుకున్నామన్న పవన్
- జనసైనికులకు రాజకీయం అంటే దేశ సేవేనని వెల్లడి
"'స్వాతంత్ర్య సమర త్యాగాలు, రాజ్యాంగ సిద్ధాంతాలు, సనాతన ధర్మ విలువల ఆధారంగా జనసేన పార్టీ రాజకీయాల్లో అడుగుపెట్టింది. ఇతరులకు భిన్నంగా జనసేన కఠినమైన మార్గాన్ని ఎంచుకుంది. జనసైనికులకు రాజకీయం అంటే దేశ సేవే . విభజన రాజకీయాలు, ప్రతీకార ధోరణులు, సోషల్ మీడియాలో విషపూరిత ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు, విద్వేషపూరిత ఆరోపణల నడుమ మార్పు కోరుకునే వాళ్లకు జనసేన పార్టీ ఓ వెలుగు దివ్వె" అని వివరించారు. తనను ఫాలో అయ్యే 4 మిలియన్ల మంది కూడా ఇదే తరహాలో బాధ్యతాయుతమైన, జవాబుదారీ రాజకీయాల కోసం పాటుపడతారని భావిస్తున్నట్టు తెలిపారు.