ఏపీలో కరోనా మృత్యుఘోష... ఒక్కరోజులో 17 మంది మరణం
- 309కి చేరిన కరోనా మరణాలు
- రాష్ట్రంలో మరో 1,813 మందికి పాజిటివ్
- గత 24 గంటల్లో 1,168 మంది డిశ్చార్జి
ఇక, కొత్తగా 1,813 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 311 కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 300, కర్నూలు జిల్లాలో 229, శ్రీకాకుళం జిల్లాలో 204 కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో 1,168 మందిని డిశ్చార్జి చేశారు. దాంతో ఇప్పటివరకు కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,393కి పెరిగింది. ఓవరాల్ గా 27,235 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇంకా 12,533 మంది చికిత్స పొందుతున్నారు.