వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై భార్య రిచా వ్యాఖ్యలు
- తన భర్త తప్పు చేశాడన్న రిచా
- ఈ శిక్ష సరైనదేనని వెల్లడి
- తమ మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న తండ్రి
తండ్రి రామ్ కుమార్ దూబే సైతం కుమారుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నిరాకరించారు. ఎన్ కౌంటర్ పై ఆయన మాట్లాడుతూ, తన కుమారుడు ఎనిమిది మంది పోలీసులను చంపాడని, తద్వారా క్షమించరాని నేరం చేశాడని వ్యాఖ్యానించారు. తమ మాట ఎప్పుడూ వినలేదని, పెద్దల మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్పష్టం చేశారు. మొదటి నుంచి వికాస్ దూబే కారణంగా తమ పూర్వీకుల ఆస్తి మొత్తం హరించుకుపోయిందని, ఈ శిక్ష సరైనదేనని అన్నారు. నేర ప్రవృత్తిని ఎంచుకున్నవాళ్లకు ఈ ఎన్ కౌంటర్ ఓ కనువిప్పు కావాలని రామ్ కుమార్ దూబే ఆకాంక్షించారు.