ఇంటి ముందు పార్క్ చేసిన కారు తెల్లారేసరికి మాయం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత
Add ap7am to your home Screen

ఇంటి ముందు పార్క్ చేసిన కారు తెల్లారేసరికి మాయం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత

Car of Delhi BJP JJ Cell in charge stolen
  • బీజేపీ ఢిల్లీ విభాగం జేజే సెల్ ఇన్‌చార్జ్ నీరజ్ తివారీ కారు చోరీ
  • నలుగురు వ్యక్తులు ఎత్తుకెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
ఢిల్లీకి చెందిన బీజేపీ నేత తన ఇంటి ముందు పార్క్ చేసిన కారును దుండగులు ఎత్తుకెళ్లారు. ఇప్పుడా కారు కోసం పోలీసులు వేట ప్రారంభించారు. బీజేపీ ఢిల్లీ విభాగం జేజే సెల్ ఇన్‌చార్జ్ అయిన నీరజ్ తివారీ దక్షిణ ఢిల్లీలోని జోర్‌బాగ్ ప్రాంతంలోని తన ఇంటి బయట రాత్రి తన కారును పార్క్ చేశారు.

ఉదయం లేచి చూసే సరికి కారు కనిపించకపోవడంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయన ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. వాటిలో కారు వద్ద నలుగురు వ్యక్తులు చాలా సేపు తచ్చాడినట్టు ఉంది. ఆ తర్వాత కాసేపటికే వారు కారు తీసుకుని పరారయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
New Delhi
BJP Leader
Neeraj Tiwari
Car
Stolen

More Telugu News