Siddipet District: కొండపోచమ్మ జలాశయానికి గండి.. నీట మునిగిన పొలాలు

  • సిద్ధిపేట జిల్లా వెంకటాపురం వద్ద కుడి కాలువకు గండి
  • గ్రామాన్ని ముంచెత్తిన నీరు
  • మునిగిన పొంట పొలాలు
Kondapochamma sagar reservoir right canal breaks down

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు ఈ ఉదయం గండిపడింది. జలాశయం నుంచి బయటపడిన నీరు గ్రామాన్ని ముంచెత్తింది. పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు కాలువకు నీటి విడుదలను ఆపివేశారు. కాగా, ఇటీవలే ఈ జలాశయం నుంచి ఆలేరు నియోజకవర్గానికి నీటిని విడుదల చేశారు. ఉదయం పూట ఈ ఘటన జరిగింది కాబట్టి సరిపోయిందని, అదే రాత్రివేళ అయితే పెను నష్టం జరిగి ఉండేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News