తారక్ గతం గురించి తెలిసి ఏడ్చేశాను: నటి పాయల్ ఘోష్
- చిత్ర పరిశ్రమలో ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఉన్నాయన్న పాయల్
- ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలవడంపై బెదిరిస్తున్నారన్న నటి
- తారక్‌కు తానెందుకు మద్దతు ఇస్తున్నదీ ఎప్పటికీ తెలుసుకోలేరన్న పాయల్
తారక్ కూడా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారంటూ తనకు మెసేజ్‌లు వస్తున్నాయని, అయితే, సినిమా కోసం ఆయన పడే కష్టం మరెవరికీ తెలియదని అన్నారు. ఆయన పట్ల కాస్త జాలి చూపించాలని కోరారు. తారక్ గతం గురించి తెలిసిన తనకు కన్నీళ్లు ఆగలేదని, ఏడ్చేశానని పేర్కొన్నారు. ఇక బెదిరింపులు ఆపేయాలని, ఎన్టీఆర్‌ను చూసి గర్వపడాలని పాయల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న తనను సోషల్ మీడియా వేదికగా దూషించడం ఆపాలని కోరారు.