నేటి సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ
- భారత్-చైనా మధ్య నేడు కమాండర్ స్థాయి చర్చలు
- నేటితో ముగియనున్న అన్‌లాక్-1
- ప్రధాని ప్రసంగంపై ఆసక్తి
మరోవైపు, చైనాకు చెందిన 59 యాప్‌లపై ప్రభుత్వం నిన్న రాత్రి నిషేధం విధించింది. అలాగే, నేటి ఉదయం భారత్-చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రజలకు ఏం చెప్పబోతున్నారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, నేటితో అన్‌లాక్-1 ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్-2కు సంబంధించి మోదీ మాట్లాడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.