అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపైకి కుక్కలను వదిలిన వైసీపీ నేత పీవీపీ

YSRCP leader PVP sends dogs on to Police
  • విక్రమ్ కైలాస్ అనే వ్యక్తిపై పీవీపీ దాడి
  • విచారణకు హాజరు కాని పీవీపీ 
  • కుక్కలను వదిలినందుకు కొత్త సెక్షన్ కింద కేసు నమోదు
వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ విల్లాకు సంబంధించి విక్రమ్ కైలాస్ అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఆయనపై హైదరాబాదులోని బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై ఆయన కుక్కలను వదిలారు. దీంతో, భయంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.  

ఈ ఘటనపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీవీపీపై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. కాసేపట్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
PVP
Tollywood
YSRCP
Dogs

More Telugu News