వెంకటేశ్ తో శేఖర్ కమ్ముల ప్రాజక్టు!
- కొత్తదనాన్నిఆవిష్కరించే శేఖర్ కమ్ముల
- ప్రస్తుతం చైతూ, సాయిపల్లవితో 'లవ్ స్టోరీ'
- శేఖర్ కమ్ముల కథకు వెంకీ గ్రీన్ సిగ్నల్
ఈ ప్రాజక్టు విషయమై ఇటీవల వెంకటేశ్, శేఖర్ మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. శేఖర్ చెప్పిన కథకు వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం నాగ చైతన్య, సాయిపల్లవితో శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' చిత్రాన్ని చేస్తున్నారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ 'నారప్ప' చిత్రాన్ని చేస్తున్నారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే సినిమా సెట్స్ కి వెళుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుంది.