గలీజు పనులకు నిలువెత్తు రూపం వైయస్ జగన్: బుద్ధా వెంకన్న
- చీకటి వ్యవహారాలకు బ్రాండ్ అంబాసడర్ అని సీబీఐ చార్జ్ షీట్ వేసింది
- మీ తండ్రిని సీఎం, మిమ్మల్ని కుబేరులను చేసిన సోనియాను మోసం చేశారు
- అధికారం శాశ్వతం అనుకుంటున్నారు
మీ తండ్రిని ముఖ్యమంత్రిని చేసి, మిమ్మల్ని కుబేరులను చేసిన సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని మోసం చేసి, మోసగాడిగా మిగిలిపోయారంటూ బుద్ధా విమర్శించారు. అధికారం శాశ్వతమనుకుంటున్నారని... త్వరలోనే మబ్బులు విడిపోవడం ఖాయమని చెప్పారు. బియ్యంలో పెళ్లలు, శనగల్లో రాళ్లు, కందిపప్పు ప్యాకెట్ కి పిన్నులు, బ్లీచింగ్ లో మైదా, ఆదరణ పథకంలో ఇచ్చిన పనిముట్లకు జగన్ స్టిక్కర్లు, టీడీపీ హయాంలో కట్టిన నిర్మాణాలకు వైసీపీ రంగులు, యంగ్ స్టార్ విస్కీ, ఆంధ్రా గోల్డ్ విస్కీ, ఆల్రెడీ ఉన్న పథకాలకు పేర్ల మార్పు... అబ్బో 90 శాతం ఏమిటి నూటికి నూరు శాతం హామీలను అమలు చేశారు కదా అని ఎద్దేవా చేశారు.