ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు మా కరోనా ఇంజక్షన్: సిప్లా
- ఇంజక్షన్ ధర రూ. 5 వేల కన్నా తక్కువే
- పది రోజుల్లో మార్కెట్లోకి విడుదల
- వెల్లడించిన సిప్లా
కరోనాను నియంత్రిస్తున్న రెమిడీసివిర్ జనరిక్ ఔషధాన్ని తయారు చేసిన సిప్లా, దీన్ని అతి త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. కాగా, తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న హెటిరో సంస్థ కూడా కరోనా ఇంజక్షన్ డ్రగ్ ను విడుదల చేసి, దీని ధర రూ. 5 వేల నుంచి రూ. 6 వేల మధ్య ఉంటుందని ప్రకటించగా, సిప్లా మాత్రం అంతకన్నా తక్కువకే ఇంజక్షన్ ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించడం గమనార్హం.