డాడీకి కటింగ్ చేసి.. ఫీజు అడిగిన యంగ్ హీరో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డాడీకి కటింగ్ చేసి.. ఫీజు అడిగిన యంగ్ హీరో!

Aadi Pinishetty cut hair to his father
  • రవిరాజా పినిశెట్టికి హెయిర్ కటింగ్ 
  • ప్రొఫెషనల్ గా చేసిన తనయుడు ఆది
  • తండ్రి పర్సు లాక్కొని ఐదొందలు లాగిన వైనం
నెలకోసారి సెలూన్లకి వెళ్లి.. హాయిగా రిలాక్సవుతూ.. హెయిర్ కటింగులు చేయించుకునే చాలామంది లాక్ డౌన్ పుణ్యమా అని కటింగ్ చేసుకోవడం నేర్చేసుకున్నారు. కరోనా భయంతో చాలా మంది ఇంటివద్దే ఎవరికి వాళ్లు హెయిర్ కటింగ్ చేసుకుంటున్నారు. లేదా, ఇంట్లోని వారి సాయంతో కటింగ్ చేసుకుంటున్నారు. అలాగే, గతంలో పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కూడా తాజాగా ఇంటి వద్దే కటింగ్ చేయించుకున్నారు.

వాళ్లబ్బాయి .. యంగ్ హీరో ఆది పినిశెట్టి తండ్రికి చక్కగా ప్రొఫెషనల్ గా హెయిర్ కట్ చేశాడు. ఆ వెంటనే షేవింగ్ కూడా చేశాడు. ఇక్కడే ఓ తమాషా జరిగింది. కటింగ్ చేయడం అయ్యాక తన ఫీజు ఇమ్మని తండ్రిని ఆది అడిగాడు.

'ఇవ్వాలంటావా?' అంటూనే తండ్రి పర్సులోంచి తీసి ఓ నోటు ఇవ్వగా, 'మా కష్టానికి ఇంత తక్కువా?' అంటూ, తండ్రి చేతిలోని పర్సు లాక్కుని, ఐదొందల నోటు తీసుకున్నాడు ఆది. ఇది సరదా కోసం తమాషాగానే చేసినా.. ఆ తర్వాత తండ్రిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, గుండెలకు హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆది తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.

<iframe src="https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FAadhiOfficial%2Fvideos%2F2382677152031054%2F&show_text=0&width=560" width="560" height="315" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allowFullScreen="true"></iframe>

Aadi
Raviraja Pinishetty
Lockdown

More Telugu News