తెలంగాణలో కొనసాగుతున్న కరోనా తీవ్రత... కొత్తగా 253 కేసులు నమోదు

Corona spreading continues in Telangana
  • గత 24 గంటల్లో 8 మంది మృతి
  • రాష్ట్రంలో ఇప్పటివరకు 182 మంది మృత్యువాత
  • తెలంగాణలో 4,737కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
తెలంగాణలో కరోనా వైరస్ అంతకంతకు ఉద్ధృతమవుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4,737 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 182 మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,352 కాగా, ఇంకా 2,203 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 179 మందికి కరోనా సోకింది. సంగారెడ్డి జిల్లాలో 24, మేడ్చల్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 11 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇక, బయటి నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో కొత్త కేసులేమీ నమోదు కాలేదు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Positive Cases
Deaths
COVID-19
GHMC
Hyderabad

More Telugu News