త్వరలోనే ఏపీ నుంచి తెలంగాణకు బస్సులు: పేర్ని నాని
- బస్సులు లేక ఇబ్బంది పడుతున్న జనాలు
- తెలంగాణ మంత్రి పువ్వాడతో చర్చిస్తామన్న ఏపీ మంత్రి
- తెలంగాణ మంత్రి, అధికారులను విజయవాడకు ఆహ్వానించి చర్చిస్తామని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని తీపి కబురు అందించారు. త్వరలోనే ఏపీ నుంచి తెలంగాణకు బస్ సర్వీసులను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ విషయంపై తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ తో చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ మంత్రి, అధికారులను విజయవాడకు ఆహ్వానించి చర్చిస్తామని చెప్పారు.