గుంటూరు మార్కెట్ ను వేలం నుంచి తప్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: పవన్ కల్యాణ్
- ప్రజా ఆస్తుల వేలం నుంచి గుంటూరు మార్కెట్ తొలగింపు
- ఏపీ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్
- ఎంతో కృషి చేశారంటూ పార్టీ శ్రేణులకు అభినందనలు
అయితే, రాష్ట్రంలో మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో విలువైన ప్రజా ఆస్తులు అమ్మడం సరికాదని, ఆస్తులు అమ్మడం అంటే పాలనాపరంగా ప్రణాళిక లేకపోవడమేనని స్పష్టం చేశారు. గుంటూరు మార్కెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో, ఇతర ప్రజా ఆస్తుల అమ్మకం విషయంలోనూ అలాంటి నిర్ణయమే తీసుకోవాలని పవన్ సూచించారు. ఉన్న ఆస్తులు అమ్మితే సంపద సృష్టి జరగదని హితవు పలికారు. ఈ సందర్భంగా పవన్ జనసేన శ్రేణులను అభినందించారు. గుంటూరు పీవీకే నాయుడు మార్కెట్ ను వేలం నుంచి తప్పించడంలో ఎంతో కృషి చేశారంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను పేరుపేరునా ప్రశంసించారు.