Corona Virus: దేశంలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 11,458 మందికి సోకిన వైనం

India crosses 3 lakh mark as it reports the highest single day spike of 11458 cases
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు ప్రతిరోజు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 11,458 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 386 మంది మరణించారు.
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,08,993కి చేరగా, మృతుల సంఖ్య 8,884కి చేరుకుంది. 1,45,779  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,54,330 మంది కోలుకున్నారు.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News