శ్రీలంకలో టీమిండియా పర్యటన వాయిదా

Team India tour of Sri Lanka cancelled
  • జూలైలో శ్రీలంకలో పర్యటించాల్సి ఉన్న భారత జట్టు
  • పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లకు చోటు
  • ఆటగాళ్లను పంపలేమన్న బీసీసీఐ
టీమిండియా క్రికెట్ ఆడి చాలా రోజులైంది. ఐపీఎల్ జరుగుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే శ్రీలంక టూర్ కు టీమిండియా వెళుతుందని, క్రికెట్ వినోదం ఆస్వాదించవచ్చని భావించిన అభిమానులకు మరింత నిరుత్సాహం తప్పలేదు. శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు జూలైలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. తాజాగా శ్రీలంకలో టీమిండియా పర్యటనను బీసీసీఐ రద్దు చేసింది. కరోనా రక్కసి స్వైరవిహారం చేస్తున్న పరిస్థితుల్లో భారత క్రికెటర్లను శ్రీలంక పంపలేమని బోర్డు స్పష్టం చేసింది. ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా పర్యటన ఏర్పాటు చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేసింది.
Go Back to Shorts
Team India
Sri Lanka
Tour
Cancel
BCCI

More Telugu News