హైదరాబాద్ నుంచి నేడు ఒడిశాకు ఐదు శ్రామిక్ రైళ్లు
- ఇటుక బట్టీల్లోని వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించాలంటూ పిల్
- కార్మికుల తరలింపుపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కోర్టు సంతృప్తి
- వారిని తరలించేంత వరకు ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు అందించాలన్న ధర్మాసనం
అలాగే, కార్మికులను పూర్తిగా తరలించే వరకు వారికి ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, వారి రవాణా చార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పేర్కొంది. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించాలని కోరుతూ ప్రొఫెసర్ రామ శంకర్ నారాయణ్ మేల్కొటి, న్యాయవాది పీవీ కృష్ణయ్య, జీవన్‌కుమార్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను నిన్న విచారించిన కోర్టు ఈ మేరకు సూచనలు చేసింది.