Lockdown: కొత్త యోగా భంగిమను వేయడానికి ఇబ్బంది పడ్డ బాలీవుడ్ నటి ఆల్యా... వీడియో ఇదిగో!

  • లాక్ డౌన్ లో యోగాసనాలు చేస్తున్న ఆల్యా
  • చివరకు అనుకున్నది సాధించిన వైనం
  • వైరల్ అవుతున్న వీడియో
Actress Alaya Tries and Strugle in A New Yoga Pose

శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునేందుకు యోగా ఎంతో ఉపకరిస్తుందని నమ్మే బాలీవుడ్ నటి ఆల్యా ఫర్నిచర్ వాలా (పూజా బేడీ కూతురు), ఓ కొత్త యోగా భంగిమను వేయడానికి చాలా ఇబ్బంది పడిందట. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆల్యా మాట్లాడుతూ, ఈ వీడియోను ట్యుటోరియల్ లా భావించవద్దని, తాను తొలిసారి ఈ భంగిమను ప్రయత్నిస్తున్నానని, మూడు నిమిషాలు ఎంతో శ్రమించానని తెలిపింది. చివరకు ఆమె అనుకున్నది సాధించగా, ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. లాక్ డౌన్ కు ముందు తాను యోగాసనాలను పెద్దగా వేసింది లేదని, కానీ ఇప్పుడు మాత్రం తన జీవితంలో యోగా ఓ భాగమైపోయిందని ఆమె తెలిపింది. వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News