India: ఒక్క రోజులో దేశంలో 9,985 మందికి కరోనా

 279 deaths reported in the last 24 hours
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు ప్రతి రోజు తొమ్మిది వేల కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,985 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 279 మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,76,583కి చేరగా, మృతుల సంఖ్య 7,745కి చేరుకుంది. 1,33,632 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,35,206 మంది కోలుకున్నారు.
Go Back to Shorts
India
Corona Virus
COVID-19

More Telugu News