టైమ్, ప్లేస్ చెబితే... ఎప్పుడైనా నేను రెడీ: సీఎం జగన్ కు నారా లోకేశ్ సవాల్
- సీఎం జగన్ కు లోకేశ్ సవాల్
- ఏడాది పాలనపై చర్చకు రావాలన్న లోకేశ్
- వైసీపీ ఏడాది పాలనపై చార్జిషీట్
తాను ట్వీట్లు చేస్తుంటేనే వైసీపీ నేతల్లో వణుకు కనిపిస్తోందని, ఇక తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తే పరిస్థితి ఎలావుంటుందో ఊహించుకోవాలని హెచ్చరించారు. జగన్ సర్కారు ఏడాదిపాలనపైనే కాదు, ఏ అంశంపై అయినా తాను చర్చకు సిద్ధం అంటూ లోకేశ్ సవాల్ విసిరారు. సీఎం జగనే టైమ్, ప్లేసు నిర్ణయించుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ సీఎం జగన్ ఏడాది పాలనపై 'చార్జిషీట్' పేరిట ఓ పుస్తకం విడుదల చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడాది అయ్యిందని వ్యంగ్యంగా అన్నారు.