Rajamouli: చరణ్ కోసం రాజమౌళి అలా ప్లాన్ చేశాడట!

Rajamouli to complete Charans shooting part first
షార్ట్స్‌లో చూడండి
లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన తెలుగు సినిమాలలో 'ఆర్ఆర్ఆర్' ఒకటి. షూటింగుకి బ్రేక్ పడడంతో సినిమా షెడ్యూల్ అంతా అప్సెట్ అయింది. దాంతో విడుదల తేదీ కూడా మళ్లీ వాయిదాపడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు షూటింగులకు ప్రభుత్వం అనుమతించడంతో ఈ సినిమా షూటింగును ప్రారంభించడానికి దర్శకుడు రాజమౌళి చకచకా సన్నాహాలు చేస్తున్నారు. పరిమిత యూనిట్ సభ్యులతో (అంటే ఏభై మంది మించకుండా) షూటింగు మొదలుపెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో ముందుగా రామ్ చరణ్ షూటింగు పార్టును పూర్తి చేయాలని రాజమౌళి నిర్ణయించాడట.. దీనికి ఓ కారణముంది. చరణ్ మరోపక్క తన తండ్రి నటిస్తున్న 'ఆచార్య' సినిమాలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. 'ఆర్ఆర్ఆర్' పూర్తయితేనే కానీ అందులో నటించడానికి వీల్లేదు. దాంతో ముందుగా చరణ్ షూటింగును కానిచ్చేసి, అతనిని పంపించాలని దర్శకుడు భావిస్తున్నాడట. ఈ క్రమంలో వచ్చే వారం నుంచి చరణ్ ఈ సినిమా షూటింగులో పాల్గొంటాడని సమాచారం. చరణ్ పార్ట్ పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ పార్ట్ చిత్రీకరిస్తారట.                
Go Back to Shorts
Rajamouli
Charan
Jr NTR
RRR

More Telugu News