TTD: గుడ్‌న్యూస్‌.. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి

good news to devotees
షార్ట్స్‌లో చూడండి
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చింది. ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారి దర్శనం చేసుకోవాలని సూచించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు,  మార్గదర్శకాలు వెల్లడికానున్నాయి.

శ్రీవారి దర్శనాలకు అనుమతి ఇవ్వాలంటూ టీటీడీ బోర్డు ఈవో అనిల్ సింఘాల్ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులను అనుమతించే ముందు టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో స్వామి వారి దర్శన ట్రయల్ నిర్వహించాలని సూచించారు.

Go Back to Shorts
TTD
Tirumala
Tirupati

More Telugu News