సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారు అమాయకులు... కార్యకర్తల కోసం కోర్టులో పోరాడుతాం: విజయసాయిరెడ్డి
- వైసీపీ గాంధేయమార్గంలో నడుస్తుంది
- 16 నెలలు జైల్లో ఉంచినా శాంతియుతంగానే పోరాడాము
- సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారు అమాయకులు
వైసీపీ ఎప్పుడూ శాంతియుతంగా, గాంధేయ మార్గంలో నడుస్తుందని విజయసాయి చెప్పారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే వారిపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో కూడా తమ సోషల్ మీడియా కార్యకర్తలను ఎంతో టార్చర్ పెట్టారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు చేసిన అరాచకాలను వెలికి తీస్తే.... వారిని పెట్టడానికి జైళ్లు సరిపోవని అన్నారు. టీడీపీ కార్యకర్తలు ఫేక్ అకౌంట్లు తయారు చేసుకుని విమర్శలు చేస్తుంటారని మండిపడ్డారు. కొందరు టీడీపీ కార్యకర్తలు తన పేరిట ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసి... తన పేరుతోనే జగన్ ను దూషించిన ఉదంతాలు ఉన్నాయని చెప్పారు.