ఉత్తరప్రదేశ్ దిశగా దూసుకువస్తున్న రాకాసి మిడతల దండు... అప్రమత్తమైన అధికారులు!
- పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న మిడతలు
- రాజస్థాన్ చేరుకున్న మిడతల దండు
- యూపీలో 17 జిల్లాలు ప్రభావితమవుతాయని అంచనా
కాగా, రెండ్రోజుల క్రితమే రాజస్థాన్ చేరుకున్న ఈ మిడతల గుంపు గాలి వ్యతిరేక దిశలో వీస్తుండడంతో చెల్లాచెదురయ్యాయి. దాంతో కొన్ని మధ్యప్రదేశ్ దిశగా వెళ్లాయి. అయితే, మరికొన్నిరోజుల్లో రాకాసి మిడతల ప్రభావం యూపీపై పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మిడతలు ఒక్కసారి పంట పొలంపై వాలాయంటే అక్కడ చూడ్డానికి ఏమీ మిగలదు. తమ పదునైన దవడలు, కాళ్లకు ఉన్న నిర్మాణాలతో ముక్కలు ముక్కలుగా కత్తిరించి వేస్తాయి. ఇవి ఎక్కువగా ఆఫ్రికా ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి.