Yanamala: ప్రజలు కష్టాల్లో ఉంటే ఏడాది పాలన పేరిట సంబరాలు చేసుకుంటున్నారు: వైసీపీపై యనమల ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. గత ఎన్నికల ముందు వైసీపీ నేతలు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలనలో పథకాల పేర్ల మార్పు తప్ప ప్రజలకు ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీ లేదని ఆయన తెలిపారు.
వైసీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఏడాది పాలన పేరిట వైసీపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు.