మాస్కులంటే మగవారికి చెడ్డ చిరాకట!: అధ్యయనంలో వెల్లడి
- మాస్కులు ధరిస్తే బలహీనులుగా భావిస్తారని భయం
- కరోనా వైరస్ తమను ఏమీ చేయలేదన్న ధీమా
- మాస్కులు లేకుండా బయట తిరిగే వారిలో పురుషులే అధికం
మాస్కులు ధరించాలన్న నిబంధన లేనిచోట్ల పురుషులు అధిక సంఖ్యలో మాస్కులకు దూరంగా ఉంటున్నట్టు సర్వేలో స్పష్టమైంది. అయితే, నిజానికి శాస్త్రపరంగా చూస్తే స్త్రీలలో కంటే పురుషుల్లోనే కరోనా ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. వారి రక్తంలో ఉండే ఓ ఎంజైమ్ వైరస్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.