మరోసారి భారీ సంఖ్యలో కొత్త కేసులు... తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
- ఇవాళ కొత్తగా 55 కేసులు
- జీహెచ్ఎంఎసీ పరిధిలో 44 మందికి కరోనా పాజిటివ్
- నేడు 12 మంది డిశ్చార్జి
కాగా, ఇవాళ నమోదైన కొత్త కేసుల్లో 44 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తించారు. సంగారెడ్డి జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. ఇక 8 మంది వలస కార్మికులకు కరోనా సోకినట్టు తేలింది. ఇప్పటివరకు కరోనా బారినపడిన వలస కార్మికుల సంఖ్య 52కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ చోటుచేసుకోలేదు. ఇప్పటివరకు తెలంగాణలో 34 మంది కరోనాతో కన్నుమూశారు.