కరోనా వైరస్ తొలి నమూనాలను ధ్వంసం చేయాలని ఆదేశించింది మేమే: చైనా ఒప్పుకోలు
- ఆ నమూనాలను నాశనం చేసేనాటికి ‘సార్స్ కోవ్2’ వైరస్‌ను గుర్తించలేదు
- వైరస్ విస్తరించకుండా ఉండాలనే నాశనం చేయమన్నాం
- అమెరికాది అనవసర రాద్ధాంతం
గుర్తు తెలియని న్యూమోనియా వ్యాపించిన వెంటనే దాని గురించి తెలుసుకునేందుకు పరిశోధనశాలలు రంగంలోకి దిగాయని, ఈ క్రమంలో పూర్తి విషయాలు వెల్లడయ్యేంత వరకు ఆ వైరస్‌ను అడ్డుకునేందుకు ‘క్లాస్-2’ వ్యాధి కారకంగా దానిని గుర్తించినట్టు ల్యూ వివరించారు. అయితే, ఈ విషయాన్ని అమెరికా వక్రీకరించి గందరగోళం సృష్టించిందని ఆరోపించారు. గతంలో ఇన్‌ఫ్లూయెంజా, సార్స్ వైరస్ నమూనాలను ప్రపంచ దేశాలతో పంచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ల్యూ గుర్తు చేశారు.