తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా... ఇవాళ 79 కేసుల నమోదు

Telangana gets more cases today
  • ఇవాళ్టి అన్ని కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే
  • మొత్తం కేసుల సంఖ్య 1275
  • నేడు 50 మంది డిశ్చార్జి
తెలంగాణలో కరోనా మళ్లీ పెరుగుతోన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే 79 కేసులు వెలుగు చూశాయి. ఈ మొత్తం కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివి కావడం గమనార్హం. ఓవరాల్ గా తెలంగాణలో ఇప్పటివరకు 1275 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 50 కాగా, కోలుకున్నవారి సంఖ్య 801కి పెరిగింది. ప్రస్తుతం 444 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, మరణాల సంఖ్య 30 అని తెలంగాణ హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Positive Cases
Active Cases

More Telugu News