మోదీతో కాన్ఫరెన్స్ లో తీవ్ర విమర్శలు గుప్పించిన మమతా బెనర్జీ
- రాష్ట్రాల మధ్య కేంద్రం వివక్ష చూపుతోంది
- మేము సహకరిస్తున్నా.. ఎదురు దాడి చేస్తున్నారు
- రాజకీయాలకు ఇది సమయం కాదు
ఒక్ స్క్రిప్ట్ ప్రకారం కేంద్రం వ్యవహరిస్తోందని... రాజకీయాలకు ఇది సమయం కాదని మమత అన్నారు. తమ అభిప్రాయాలను ఇంత వరకు ఎవరూ అడగలేదని... ఫెడరల్ వ్యవస్థను కూల్చవద్దని అన్నారు. ఈ సంక్షోభ సమయంలో కేంద్రానికి తాము పూర్తిగా సహకరిస్తున్నామని... అయినా, తమపై ఎదురు దాడి ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎందుకు ఎప్పూడు బెంగాల్, బెంగాల్, బెంగాల్ అంటూ విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.