తెలంగాణలో ఇవాళ కొత్తగా 33 కరోనా కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలోనే 26 మందికి కరోనా
- మరో ఏడుగురు వలస కార్మికులకు కరోనా నిర్ధారణ
- మొత్తం కేసుల సంఖ్య 1196
ఇవాళ తెలంగాణలో 33 కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో 26 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే గుర్తించారు. ఏడుగురు వలస కార్మికులకు కూడా కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. ఇక, తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1196కి పెరిగింది. ఇవాళ ఎవరూ డిశ్చార్చి కాలేదు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనాతో 30 మంది మరణించారు.