'విరాట పర్వం' నుంచి సాయిపల్లవి లుక్
- వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం'
- నక్సలైట్ పాత్రలో సాయిపల్లవి
- ప్రధానమైన పాత్రలో రానా
ఈ రోజున ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'విరాటపర్వం' యూనిట్ సభ్యులు శుభాకాంక్షలు అందజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సాయిపల్లవి నక్సలైట్ గా నటించినట్టు తెలుస్తోంది. అందుకు తగినట్టుగానే విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు .. లగేజ్ తో అమరవీరుల స్థూపం దగ్గర సాయిపల్లవి ఎదురు చూస్తూ కూర్చుంది. ఈ పోస్టర్ తోనే సాయిపల్లవి పాత్ర ఎలా వుండనుందనే అవగాహన కలుగుతోంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు.
.