రెండో రోజు కూడా మద్యం దుకాణాల ముందు బారులు.. హంగామా.. ఫొటోలు ఇవిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండో రోజు కూడా మద్యం దుకాణాల ముందు బారులు.. హంగామా.. ఫొటోలు ఇవిగో

wine shops open in india
  • దేశ వ్యాప్తంగా మందుబాబుల హంగామా
  • మద్యం కోసం ఖర్చుకు వెనకాడని వైనం
  • రేట్లు పెంచేసినా భారీగా కొనుగోళ్లు
దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఆ షాపుల ముందు నిన్న కనపడిన హంగామా అంతాఇంతా కాదు. రెండో రోజు కూడా మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరి నిలబడ్డారు. కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాల ముందు చిత్ర విచిత్ర పరిస్థితులు కనపడ్డాయి. పలు రాష్ట్రాల్లో మద్యం రేట్లు పెంచేసినప్పటికీ మందుబాబులు ఖర్చుకు ఏ మాత్రం వెనకాడట్లేదు. ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాల ముందు నిన్న నిబంధనలు పాటించకపోవడంతో ఆయా షాపులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

రెండో రోజు దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు పరిస్థితులు..
                          
దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేది మీరే అంటూ మందుబాబులపై ఢిల్లీలోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి పూలు చల్లాడు.                                                                    కర్ణాటకలోని ఓ లిక్కర్ షాపు ముందు క్యూలో సీసాలు, కర్చీఫ్‌ వంటివి పెట్టి రిజర్వ్ చేసుకుని ఉదయం నుంచే దుకాణం ముందు నిలబడ్డారు

       


 బెంగళూరులోని ఓ మద్యం దుకాణంలో తాను భారీగా కొన్న మద్యం సీసాలకు చెల్లించిన బిల్లును కొందరు వ్యక్తులు మీడియాకు చూపారు.
                     
       
 బెంగళూరులో మద్యం కోసం బారులు తీరిన అమ్మాయిలు
     
               దేశంలోని పలు ప్రాంతాల్లో మందు బాబుల హంగామా..
India
Lockdown
Corona Virus

More Telugu News