Nithin: 'పవర్ పేట' విషయంలో నితిన్ కొత్త నిర్ణయం

Power Peta Movie
షార్ట్స్‌లో చూడండి
'భీష్మ' హిట్ తో నితిన్ మంచి జోరుమీదున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు వున్నాయి. ఒక సినిమా సెట్స్ పై ఉండగా, రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. ఈ మూడు సినిమాలు పూర్తయిన తరువాత ఆయన 'పవర్ పేట' అనే సినిమా చేయనున్నాడు.

ఇంతకు ముందు నితిన్ తో 'ఛల్ మోహన్ రంగ' చేసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా కథ నితిన్ కి ఒక రేంజ్ లో నచ్చిందట. కథ మొత్తాన్ని రెండున్నర గంటల్లో చెప్పలేమని భావించిన నితిన్, ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తే బాగుంటుందని భావించాడట. ఆ దిశగానే స్క్రిప్ట్ పై కసరత్తు జరుగుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Go Back to Shorts
Nithin
Krishna Chaitanya
Power Peta

More Telugu News