E-Commerce: గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఈ-కామర్స్ అమ్మకాలకు పచ్చ జెండా

Centre gives nod for e commerce portals in green and orange zones
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్రం లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రకటించిన రెండో విడత లాక్ డౌన్ మే 3న ముగియనుంది. ఈ నేపథ్యంలో, కేంద్రం మే 4 నుంచి అమల్లోకి వచ్చేలా గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ప్రకటించింది.

ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో ఈ-కామర్స్ సంస్థలు అన్ని రకాల వస్తువులు విక్రయించుకోవచ్చని తెలిపింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ పోర్టళ్ల ద్వారా కేవలం నిత్యావసరాలనే అనుమతించారు. తమకు అన్ని రకాల వస్తువులు విక్రయించే వెసులుబాటు కల్పించాలని పలు ఈ-కామర్స్ సైట్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం వెలువడిందని భావిస్తున్నారు. ఇక, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బార్బర్ షాపులకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది.
Go Back to Shorts
E-Commerce
Amazon
Flipkart
Green Zone
Orange Zone
Red Zone
Lockdown
Corona Virus
India

More Telugu News