punjab: పోలీసు అధికారిని కారుతో ఢీ కొట్టి, ఈడ్చుకెళ్లిన యువకుడు.. వీడియో ఇదిగో!

  • పంజాబ్‌లోని జలంధర్ లో ఘటన 
  • లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన  
  • యువకుడిని పట్టుకున్న పోలీసులు
Punjab A car driver drags a police officer on cars bonnet

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు విధులు నిర్వహిస్తోన్న పోలీసు అధికారిపై ఓ యువకుడు దారుణ ఘటనకు పాల్పడ్డాడు. పంజాబ్‌లోని జలంధర్‌ ప్రాంతంలోని మిల్క్‌బర్ చౌక్ వద్ద లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి కారులో ఓ యువకుడు రోడ్డుపై తిరుగుతున్నాడు.

దీంతో కారుని ఆపాలని ఓ పోలీసు అధికారి సూచించాడు. కారు ఆపకపోవడమే కాకుండా ఆయనపైకి కారును తీసుకెళ్లేందుకు యువకుడు ప్రయత్నించాడు. దీంతో కారు ముందు భాగంపై ఆ పోలీసు అధికారి పడ్డాడు. దీంతో ఆ యువకుడు కారుని అలాగే కొన్ని మీటర్లు ముందుకు పోనిచ్చాడు.

వెంటనే అక్కడున్న ఇతర పోలీసులు ఆ కారును వెంబడించారు. ఆ యువకుడు కారు ఆపిన వెంటనే అతడిని కొడుతూ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని జలంధర్ పోలీసు అధికారి సుర్జీత్ సింగ్ తెలిపారు.  

More Telugu News