మందుబాబులకు శుభవార్త... గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్!
- షరతులతో కూడిన అనుమతి
- ఒక్కొక్కరికి మధ్య 6 అడుగుల దూరం
- షాపు వద్ద ఐదుగురి కంటే ఎక్కువమంది ఉండరాదని వెల్లడి
అయితే, విధిగా ఒక్కొక్కరికి మధ్య 6 అడుగుల దూరం ఉండాలని, దుకాణం వద్ద ఒక్కసారి ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువమంది ఉండరాదని స్పష్టం చేసింది. ఇది గ్రీన్ జోన్ల వరకే వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. కరోనా కేసులు అధికంగా ఉండే రెడ్ జోన్లలో ఎలాంటి సడలింపులు ఉండవని, ఓ మోస్తరు కేసులుండే ఆరెంజ్ జోన్లలో మద్యం షాపులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. అంతేకాదు, గ్రీన్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇస్తూ, 50 శాతం ప్రయాణికులతో బస్సులు తిప్పేందుకు కూడా కేంద్రం అనుమతించింది.