తెలంగాణలో ఇవాళ కొత్తగా 6 కేసులు... మరణాల్లేవు!

Telangana witnesses only six more cases today
  • రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1044
  • 464 మంది డిశ్చార్జి
  • ఇప్పటివరకు 28 మరణాలు
తెలంగాణలో గత కొన్నిరోజులుగా కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. అందుకు అనుగుణంగానే ఇవాళ కేవలం 6 కేసులే వెల్లడయ్యాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1044కి చేరింది. ఇవాళ ఒక్క మరణం కూడా సంభవించలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. నేడు 22 మంది డిశ్చార్జి కాగా, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 464కి పెరిగింది. ఇక 552 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 28 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Positive Cases
Deaths
Active Cases

More Telugu News