భారత్ లో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి... 24 గంటల్లో 1823 కొత్త కేసులు
- ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 33,610
- 24 గంటల వ్యవధిలో 67 మంది మృతి
- చికిత్స పొందుతున్న వారి సంఖ్య 24,162
24 గంటల వ్యవధిలో 67 మంది మృత్యువాత పడగా, మొత్తం మరణాల సంఖ్య 1075కి పెరిగింది. గడచిన 24 గంటల్లో 576 మంది డిశ్చార్జి కావడం కాస్తంత ఊరట కలిగించే విషయం. ఇక రాష్ట్రాల విషయానికొస్తే, ఏపీలో పరిస్థితి ఆందోళన కలిగిస్తుండగా, తెలంగాణలో మాత్రం అదుపులోనే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.