ఐఐటీ హైదరాబాద్ వద్ద 1,600 మంది కూలీల ఆందోళన.. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి
- ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన కూలీలు
- అడ్డుకున్న పోలీసులు
- రాళ్లదాడిలో పోలీసుల వాహనం ధ్వంసం
గత నెల రోజులుగా ఇక్కడే చిక్కుకుపోయామని ఇంటికి వెళ్లనివ్వాలని డిమాండ్ చేశారు. ఇంటికి వెళ్లడానికి సిద్ధమైన కూలీలను అడ్డుకునేందుకు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో పోలీసులపై రాళ్లు, కర్రలతో కూలీలు దాడికి యత్నించారు. ఈ క్రమంలో రాళ్లు పడడంతో పోలీసు వాహనం ధ్వంసమైంది. దీంతో ఘటనా స్థలికి మరింత మంది పోలీసు బలగాలు భారీగా చేరుకుని, కూలీలను అదుపులోకి తెచ్చారు.