Rana: 'బాహుబలి-2' రిలీజ్ డే సందర్భంగా రానా స్పందన

  • 2017 ఏప్రిల్ 28న రిలీజైన బాహుబలి-2
  • మూడేళ్లయిన సందర్భంగా రానా ట్వీట్
  • ప్రభాస్ తో కలిసివున్న ఫొటోను పంచుకున్న వైనం
Rana responds on Babubali the conclusion release day

తెలుగు చలనచిత్ర చరిత్రలో బాహుబలి చిత్రాలకు ప్రత్యేకస్థానం ఉంటుంది. బడ్జెట్ పరంగానే కాకుండా, రేంజ్ పరంగానూ ఆ సినిమాలు అంతర్జాతీయ స్థాయికి దీటుగా నిలిచాయి. వాటిలో చివరిదైన బాహుబలి-2 చిత్రం విడుదలై ఇవాళ్టికి మూడేళ్లయింది. బాహుబలి-2 చిత్రం 2017 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.

దీనిపై నటుడు దగ్గుబాటి రానా స్పందించారు. తాను ప్రభాస్ తో కలిసివున్న ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. 'ఈ ఫొటో మా ఆనందాన్ని వ్యక్తీకరిస్తోంది. మహాశక్తిమంతమైన బాహుబలి-2కి మూడేళ్లు' అంటూ ట్వీట్ చేశారు. బాహుబలి చిత్రాల్లో రానా ప్రతినాయక భల్లాలదేవుడిగా నటించిన సంగతి తెలిసిందే.

More Telugu News