లాలు చికిత్స పొందుతున్న వార్డులో కరోనా రోగి.. వైద్యుడి సహా సిబ్బంది మొత్తం క్వారంటైన్!
- రాంచీలోని రిమ్స్‌లో లాలుకు చికిత్స
- ఆ వైద్యుడే కరోనా రోగికీ చికిత్స చేసిన వైనం
- లాలుకు కరోనా పరీక్షలు?
లాలు ప్రస్తుతం రాంచీలోని రాజేంద్రనగర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని పేయింగ్ వార్డులో రెండేళ్లుగా చికిత్స తీసుకుంటున్నారు. కరోనా రోగికి చికిత్స చేసిన వైద్యుడే లాలూకు కూడా సేవలు అందిస్తుండడంతో ఆసుపత్రి యాజమాన్యం అప్రమత్తమైంది. వైద్యుడు సహా ఆ వార్డులోని సిబ్బంది అందరినీ మూడు వారాల క్వారంటైన్‌కు పంపినట్టు తెలిపింది. అలాగే, లాలూకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.