Bollywood: అక్షయ్ పెద్ద మనసు... ముంబై పోలీసులకు రూ. రెండు కోట్ల విరాళం
దేశం కోసం, ప్రజల కోసం ఏం చేయడానికైనా ముందుండే బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కరోనాపై పోరాటానికి కేంద్రం ప్రభుత్వానికి ఇప్పటికే రూ.25 కోట్ల భారీ విరాళం ప్రకటించిన అక్షయ్.. పోలీసులకు కూడా బాసటగా నిలిచారు. కరోనాపై పోరులో ప్రజా సంరక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న ముంబై పోలీసులకు సాయం చేశారు. ముంబై పోలీస్ ఫౌండేషన్‌కు రెండు కోట్ల విరాళం ప్రకటించారు. దాంతో, ముంబై పోలీసు శాఖ అక్షయ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
దీనిపై స్పందించిన అక్షయ్.. ‘నేను బాధ్యతను నిర్వర్తించా. మీరు కూడా చేస్తారని అనుకుంటున్నా. పోలీసుల వల్లే మనం సురక్షితంగా జీవించగలుగుతున్నాం’ అని అక్షయ్ ట్వీట్ చేశారు. అలాగే, కరోనాపై పోరాటంలో తమ ప్రాణాలు కోల్పోయిన ముంబై హెడ్ కానిస్టేబుల్స్ చంద్రకాంత్ పెందుర్కర్, సందీప్ సుర్వేకు అక్షయ్ నివాళులు అర్పించారు.