america: 24 గంటల్లో అమెరికాలో 2,494 మంది మృతి.. భారీగా పెరిగిన కేసులు

coronavirus cases in america
షార్ట్స్‌లో చూడండి
అమెరికాలో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో అమెరికాలో 2,494 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య ఇప్పటి వరకు 53,928గా ఉంది. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 9,56,375కి చేరిందని జాన్స్‌ హోప్కిన్‌ విశ్వవిద్యాలయం తెలిపింది. కరోనా కేసులు, మృతుల సంఖ్య ఏ దేశంలో లేనంత అత్యధికంగా అమెరికాలో ఉంది.

శుక్రవారం అమెరికాలో 1,258 మంది ప్రాణాలు కోల్పోయారు. మూడు వారాల్లో అత్యల్ప మరణాల సంఖ్య ఇదే. ఇంతలోనే మృతుల సంఖ్య భారీగా పెరిగింది.  24 గంటల్లో అగ్రరాజ్యంలో కొత్తగా సుమారు 36 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.  

Go Back to Shorts
america
Corona Virus
COVID-19

More Telugu News